ఐపోన్లకు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు..ఆ బ్రాండ్ కు ఉన్న డిమాండ్ అలాంటిది..అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చే ఐఫోన్లను ఒక్కసారైనా వాడాలని ఎంతోమంది అనుకుంటారు. ఇప్పటికే 14 సిరీస్‌ల ఐఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ క్రమంలో పాత సిరీస్ ఐఫోన్ల ధరలు ఎప్పటికప్పుడు తగ్గుతున్నాయి.ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ ఈ ఫోన్ల పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.. ఆ ఫోన్ల గురించి కాస్త వివరంగా..
ఐఫోన్11 : ఐఫోన్ 11 రూ.43,900 ధరతో లాంచ్ అయింది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో రూ.40,999కు లభిస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 11పై రూ.17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం ఎక్స్చేంజ్ వ్యాల్యూ లభిస్తే.. ఐఫోన్ 11 ధర రూ.23,499కు తగ్గుతుంది.
అంతేకాకుండా రూ.2901 స్పెషల్ ప్రైజ్ డిస్కౌంట్(క్యాష్ బ్యాక్/కూపన్) కూడా పొందవచ్చు. ఇక, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్లతో కలిపి ఐఫోన్ 11ను రూ.20,000లోపే సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్స్ : ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో లభిస్తుంది. ఆక్టా కోర్ యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో f/1.8 ఆపర్చర్‌తో పాటు 12 మెగాపిక్సెల్ మొదటి కెమెరా, f/2.4తో 12 మెగాపిక్సెల్ రెండో కెమెరా ఉంటుంది..
ఐఫోన్ 13 : ఐఫోన్ 13 రూ.69,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.65,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ తాజాగా రూ.17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మంచి స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి, ఐఫోన్13ను ఇప్పుడు రూ.48,499కు సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్లు,ధర..
ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. దీంట్లోని 12MP మెయిన్ కెమెరా సినిమాటిక్ మోడ్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 12 మోడల్స్‌లో కంటే ఐఫోన్ 13లో అధిక స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. లేటెస్ట్ ఏ15 బయానిక్ చిప్, ఐఓఎస్ 15తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ, 3,227 ఎంఏహెచ్ సామర్థ్యం బ్యాటరీ, 20W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ ను కొనుగోలు చెయ్యాలని అనుకొనేవారు.. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై దీన్ని కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్ బ్యాంక్ ఆఫర్ కూడా పొందవచ్చు. అలాగే రూ. 3901 స్పెషల్ డిస్కౌంట్ (క్యాష్ బ్యాక్/కూపన్) కూడా పొందవచ్చు. దీంతో ఫైనల్‌గా రూ.45000 లోపే ఐఫోన్13ను సొంతం చేసుకోవచ్చు..ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఫోన్ కొనాలని అనుకుంటే వెంటనే కొనెయ్యండి…