నాకు ఆ హీరో అంటే నాకు విపరీతమైన క్రేజ్..!!

యాంకర్  విష్ణు ప్రియ ఈటీవీ  షో నుంచి వెళ్లిపోయిన తర్వాత పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయినా కూడా తన గ్లామర్ ఫొటోస్ తో ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే వుంది. ఈ మధ్య చేసిన ప్రైవేట్ సాంగ్ కూడా యూట్యూబ్ లో ట్రెండింగ్ అయ్యింది.

ఇక ఈ ముద్దుగుమ్మ కు ఇష్టమైన హీరోలలో అక్కినేని అఖిల్ అంటే విపరీతమైన పిచ్చి. తాజాగా జరిగిన జీ తెలుగు లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు ప్రియ మరోసారి అఖిల్ పై తన ప్రేమను వ్యక్తం చేసింది.నాకు ఆ హీరో అంటే నాకు విపరీతమైన క్రేజ్ మరో సారి కుండ బద్దలు కొట్టినట్లు గా చెప్పింది.

ఇక ఇన్ని సార్లు బాహాటంగా చెబుతున్నా అఖిల్ విష్ణు ప్రియ ను కరుణించడం లేదు. కనీసం తన సినిమా లో ఒక కారెక్టర్ గాని లేదా ఒక స్పెషల్ సాంగ్ గాని ఇచ్చేలా చూడాలని విష్ణు ప్రియ అభిమానులు, అఖిల్ అక్కినేని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు