రోబోలతో విందు..ఎగబడుతున్న జనం..ఎక్కడంటే?

-

కొన్ని నగరాల్లో భోజన ప్రియులను మరింత ఆకట్టుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.ముఖ్యంగా ఫుడ్ విషయంలో కొత్త కొత్త వంటలను పరిచయం చేస్తున్నారు.. మరికొంత మంది హోటల్ సర్వ్ చేయడానికి కొత్త పద్దతులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.. మొన్నీమధ్య హైదరాబాద్ ప్రముఖ రెస్టారెంట్ లో రైలు లో తిన్న ఫీలింగ్ కలగాలని ఆ సర్వీసును అందించారు. మరి కొన్నిటిలో మాత్రం ఆటోమేటిక్ గా సర్వీసులు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ లో రోబోలు సందడి చేస్తున్నాయి. బయట వెల్కమ్ దగ్గర నుంచి ఆర్డర్, సర్వ్ చేయ్యడం వరకు అన్ని అవే చూసుకుంటున్నాయి. ఆ సర్వీసు అందరికి నచ్చడంతో జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. రోజు రోజుకు జనాల సంఖ్య పెరిగి పోతుందని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు..

 

ఇప్పుడు విజయవాడ లో కూడా అలాంటి సర్వీసును అందుబాటులోకి తీసుకొని వచ్చారు.ఖాన్‌సాబ్‌ రెస్టారెంట్‌.. అక్కడ అడుగుపెట్టగానే మరో ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఎందుకంటే అక్కడ మీకు స్వాగతం చెప్పేది రోబోలే.. అంతేకాదు మీకేం కావాలో ఆర్డర్‌ తీసుకుంటాయ్‌.. క్షణాల్లో మీ ఆర్డర్‌ని మీ టెబుల్ మీద పెట్టేస్తాయి.. భోజన ప్రియులు ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోరుకుంటారు అలా కోరుకునే వారి కోసమే ఖాన్‌సాబ్‌ రెస్టారెంట్‌. ఒక్కసారి ఈ రెస్టారెంట్‌లో అడుగుపెట్టామంటే మనకు రజనీకాంత్‌ రోబో సినిమాలోని చిట్టి గుర్తుకు వస్తుంది.

ఈ రెస్టారెంట్‌ యాజమాన్యం ట్రెండ్‌ను సెట్‌ చేస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు, ఆహ్వానించేందుకు మనుషులకు బదులు చిట్టి ది రోబో3.Oని నియమించింది. ఆ రెస్టారెంట్‌లో మనుషులు ఉండరు..అన్నీ రోబోలే ఉంటాయి.కూల్‌గా సాగే మ్యూజిక్‌, అక్కడి లైట్లు, ఇంటీరియర్‌ డెకరేషన్‌, డైనింగ్‌ టేబుల్‌..ఇలా అన్ని హైక్లాస్‌గా ఉంటాయి.ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేయాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్‌ ఫుడ్ జోన్ అంటున్నారు భోజన ప్రియులు. వీకెండ్స్ , బర్త్ డే పార్టీలు, కిట్టి పార్టీలు నిర్వహించుకునేలా హాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి సర్వీసును అందిస్తున్న రెస్టారెంట్ ఇదే..నోరురించే భిర్యానిలు, వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడ చాలా రుచిగా ఉంటాయి. అందుకే డిమాండ్ ఎక్కువ.. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళితే ఆ రెస్టారెంట్ లో భోజనం చేసి ఆ థ్రిల్ ను ఎంజాయ్ చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news