ఐసీయూలో దారుణం.. శిశువు ప్రాణం తీసిన చీమలు..!!

-

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమలు కుట్టడంతో మూడు రోజుల శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శిశువుకు చీమలు కుట్టడంతో మరణించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చిన్నారి మృతి
చిన్నారి మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహోబా జిల్లా కుల్పహర్ తహసీల్ ప్రాంతంలోని ముధారి గ్రామానికి చెందిన సురేంద్ర రైక్వార్ భార్య సీమ గర్భిణీ. ఆమెకు గర్భస్రావం కావడంతో మే 30వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆమెకు పండంటి చిన్నారి పుట్టింది. అస్వస్థత కారణంగా పాపను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో చికిత్స పొందుతోంది. శిశువుకు చీమలు కుట్టడంతో జూన్ 2వ తేదీన చిన్నారి మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల చిన్నారి మృతి చెందినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. అలాగే చికిత్స సమయంలో డాక్టర్ రూ.6,500 లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news