మీ చిన్న పిల్లల మంచి ఆర్థిక భవిష్యత్తు కోసం…SBI అందిస్తున్న కొత్త పథకాలు

-

దేశీయ అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సేవ‌ల విభాగంలో భాగంగా SBI పెహ్లా క‌ద‌మ్, పెహిలి ఉదాన్ పేరిట రెండు సేవింగ్ అకౌంట్స్ మైన‌ర్ పిల్ల‌ల కోసం ప్రారంభించింది. దీని ద్వారా మీ చిన్న పిల్లలను ఆర్థిక భవిష్యత్తు కోసం సిద్ధం చేయడంలో ఈ అకౌంట్స్ సహాయపడతాయి. ఇదేకాకుండా డబ్బును ఆదా చేసే అలవాటును చిన్న వయసు నుంచే పెంచుతాయి. పెహ్లా క‌ద‌మ్, పెహిలి ఉదాన్ పొదుపు ఖాతాకు సంబంధించిన‌ కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.

పెహ్ల క‌ద‌మ్ ఖాతా మైన‌ర్ పిల్ల‌ల పేరిట ఏ వ‌య‌సు లోనైనా ప్రారంభించ‌వ‌చ్చు. కానీ ఈ ఖాతా త‌ల్లిదండ్రులు, సంర‌క్ష‌కులతో క‌లిపి ఉమ్మ‌డిగా అకౌంట్ ప్రారంభించాలి. ఎస్‌బీఐ పెహ్ల క‌ద‌మ్ అకౌంట్ లావాదేవీల విలువ ఇంటెర్నెట్ బ్యాంకింగ్‌ తో అయితే రోజుకు రూ. 5000 వరుకు ప‌రిమితి ఉంది. అదే మొబైల్ బ్యాంకింగ్ అయితే రోజుకు రూ.2000 వరకే ఉంది. ఎస్‌బీఐ పెహ్ల క‌ద‌మ్ వ‌డ్డీ రేటు, ఎస్‌బీఐ పొదుపు ఖాతాకు సమానం. ప్రస్తుతం ఎస్‌బీఐ ల‌క్ష రూపాయ‌ల కంటే త‌క్కువ డిపాజిట్ల‌పై 2.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇదే రేటు ఎస్‌బీఐ పెహ్ల క‌ద‌మ్ కి కూడా వర్తిస్తుంది. ఈ అకౌంట్ పై పిల్లలు ఫోటో ఉన్న ఏటీఎం-క‌మ్-డెబిట్ కార్డును మైన‌ర్ ‌కి ఇంకా త‌ల్లిదండ్రులకి జారీ చేస్తారు. ఏటీఎం లేదా పీఓఎస్ వ‌ద్ద రూ. 5000 వ‌ర‌కు లావాదేవీలు చేసుకోవచ్చు. 10 చెక్కుల‌తో క‌లిగిన‌ ప‌ర్స‌న‌ల్ చెక్‌బుక్ సంర‌క్ష‌కుడికి మైన‌ర్ పిల్ల‌ల పేరుతో జారీచేస్తారు.

పెహ్లీ ఉడాన్ ఖాతా కేవ‌లం మైన‌ర్ పిల్ల‌ల పేరుతో ప్రారంభించ‌వ‌చ్చు. అయితే వారి వ‌య‌సు 10 ఏళ్ల‌కు ఎక్కువ‌గా ఉండాలి. ఈ ఖాతా ప‌రిమితి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే రోజుకు రూ.5000, మొబైల్ బ్యాంకింగ్ ‌తో అయితే రోజ‌కు రూ.2000 వ‌ర‌కు లావాదేవీల ప‌రిమితి ఉంది. వ‌డ్డీ రేట్లు ఎస్‌బీఐ పొదుపు ఖాతా మాదిరిగానే ఉంటుంది. ఎస్‌బీఐ పెహ్లీ ఉడాన్ ఖాతాపై పిల్ల‌ల ఫోటో క‌లిగిన ఏటీఎం-క‌మ్‌-డెబిట్ కార్డును రూ.5000 లావాదేవీల ప‌రిమితితో పిల్ల‌ల పేరిట జారీచేస్తారు. 10 చెక్కుల‌తో క‌లిగిన వ్య‌క్తిగ‌త చెక్‌బుక్, పిల్ల‌ల పేరుతో జారీచేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news