వెబ్ సిరీస్ లో ప్రధాని మోడీ మాజీ బాడీగార్డ్

-

భారత  ప్రధాని నరేంద్ర మోడీ మాజీ బాడీగార్డ్ (PM Modis Ex-Bodyguard), రా ఏజెంట్ గా పని చేసిన లక్కీబిష్ట్ (Lucky Bisht) నటుడిగా అరంగేట్రం చేశారు. “సేన – గార్డియన్స్ ఆఫ్ ది నేషన్” వెబ్ సిరీస్ లో  అతిథి పాత్రలో మెరిశారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను అందులో నటించినట్లు లక్కీ వెల్లడించారు. నిజమైన సైనికుడిని తెరపై చూపించాలని మేకర్స్ భావించారు. నా మిలిటరీ నేపథ్యం, అనుభవం దృష్ట్యా ఆ అవకాశం ఇచ్చారు.

pm

ఈ నటన నాకు పూర్తిగా కొత్త. కానీ కొత్త అనుభవాన్ని ఇచ్చింది. నిజ జీవితంలో మన విధుల్ని మనం నిర్వర్తిస్తాం. క్షేత్రస్థాయిలో సైనికుడిగా ఉన్నప్పుడు మన భుజాలపై ఎంతో బాధ్యత ఉంటుంది. నిజమైన యుద్ధాల్లో మన త్యాగాలు, భయాలు అన్నీ ఉంటాయి. సైనికుడిగా నటించడం అంటే.. అలాంటి ఉద్వేగాలనే కెమెరా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాలి” అని లక్కీ బిష్ట్ మీడియాతో తన కొత్త జర్నీ గురించి వెల్లడించారు. “సేన – గార్డియన్స్ ఆఫ్ ది నేషన్” ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news