మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. కృష్ణా జిల్లా జి. కొండూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మరియు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
వాదనలు ముగిసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేస్తూ హై కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఉద్దేశ పూర్వకంగానే దేవినేని ఉమపై కేసులు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అటు ప్రభుత్వం తమ వాదనలు కూడా వినిపించింది. దేవినేని ఉమనే రెచ్చగొట్టేలే వ్యాఖ్యలు చేశాడంటూ ఆరోపించింది. ఇక ఇరువాదనలు విన్న హైకోర్టు.. దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు మంగళ వారం ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ… ఆదేశాలు జారీ చేసింది.