టాలీవుడ్ @ సిక్స్‌ప్యాక్‌…

-

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ కొన‌సాగుతున్న‌ది.  హీరోలు మాస్ లుక్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.  మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవ‌డానికి సిక్స్ ప్యాక్ కోసం కండ‌లు పెంచుతున్నారు.  గంట‌ల త‌ర‌బ‌డి జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.  కొంత‌మంది హీరోలు మిన‌హా ప్ర‌తి ఒక్క యంగ్ హీరో ఆరుప‌ల‌క‌ల దేహం కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు.

ఒక‌ప్పుడు స‌ల్మాన్ ఖాన్ ఎలాగైతే త‌న దేహంతో ఆక‌ట్టుకున్నాడో, ఇప్పుడు టాలీవుడ్‌లోని ప్ర‌తీ హీరో కూడా అదే విధంగా ఆక‌ట్టుకోవ‌డానికి, పాత్ర‌కు త‌గిన విధంగా క‌నిపించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  గ‌ని సినిమా కోసం వ‌రుణ్ తేజ్ కండ‌లు పెంచుతున్నాడు.  త‌న సిక్స్‌ప్యాక్ బాడీతో న్యూలుక్‌తో అద‌రగొడుతున్నాడు.  జిమ్‌లో ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రోవైపు అక్కినేని హీరోలైన నాగ‌చైత‌న్య బాలీవుడ్ చిత్రం లాల్‌సింగ్ చ‌ద్దా కోసం త‌న మేకోవ‌ర్‌ను మార్చేశాడు.  లాల్ సింగ్ చ‌ద్దా సినిమాలో నాగ‌చైత‌న్య జ‌వాన్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.  అంతేకాదు, మ‌రో అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ కోసం లుక్‌ను, స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు.  పుల్ సిక్స్‌ప్యాక్ బాడీతో అల‌రిస్తున్నాడు.  నిఖిల్ కూడా ఆరుప‌ల‌క‌ల దేహంతో ఆక‌ట్టుకుంటున్నాడు.  ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో సూప‌ర్ హీరోలుగా రాణిస్తున్న రామ్ చ‌ర‌ణ్‌, ఎన్‌టీఆర్‌లు ఆర్ఆర్ఆర్ కోసం వారి మేకోవ‌ర్‌ను పూర్తిగా మార్చేశారు.  ఇక ప్ర‌భాస్ గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ఇప్ప‌టికే పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్ర‌భాస్‌, ఉత్త‌రాది మాస్ ప్రేక్ష‌ల‌కుల‌ను ద‌గ్గ‌ర కావ‌డం కోసం బాహుబ‌లి లాంటి దేహాన్ని మెయింటైన్ చేస్తున్నాడు.  మొత్తానికి టాలివుడ్‌లో ఒక‌రిద్ద‌రు మిన‌హా చాలా మంది స్టార్స్ ఆరుప‌ల‌క‌ల దేహంతో ఆక‌ట్టుకుంటు ఫిట్‌గా ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news