మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ నేతలకు అసలు అర్థం కావడం లేదు. ఆయనతో సన్నిహితంగా ఉన్న నేతలకు కూడా ఇప్పుడు ఆయన రాజకీయ ప్రయాణం అర్థం కాక వాళ్ళు ఏ పార్టీలో ఉండాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. జనసేన పార్టీలోకి ఆయన వెళ్ళవచ్చు అంటూ కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రచారం చేశారు.
అయితే అధికార వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారని కొంతమంది అన్నారు. అయితే చిరంజీవి మాత్రం భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లాలని చెప్పడంతో బీజేపీ వైపు చూస్తున్నారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అలా కాకుండా వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో గంటా శ్రీనివాసరావు ఉన్నారని అన్నారు కొంతమంది. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ప్రకటన చేశారు.
అయితే అది నిజం కాదని తాను అధినేత చంద్రబాబు నాయుడుతో చెప్పి చేస్తాను అంటూ గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటన చేశారు. దీంతో అసలు గంటా శ్రీనివాసరావు ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మరి గంట ఇదే రాజకీయం ఎన్నాళ్లు చేస్తారు ఆ తెలుగుదేశం పార్టీని ఎంతవరకు అంటిపెట్టుకుని ఉంటారు అనేది చూడాలి. గంటా పార్టీ మారితే టీడీపీకి నష్టమే.