కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. శంకర్ రావు పేరు అందరూ వినే ఉంటారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రి గా పి. శంకర్ రావు పని చేశారు. అయితే.. తాజాగా మాజీ మంత్రి శంకర్ రావుకు నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై నమోదు అయిన మూబు కేసుల్లో రెండింటిలోనూ దోషిగా తేలారు శంకర్ రావు.
భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన ఆరోపణలపై 2015 లో శంకర్ రావు పై షాద్ నగర్ లో మూడు కేసులు నమోదు అయ్యాయి. వీటిపై నిన్న విచారణ జరగగా… సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఓ కేసులో ఆయనకు ఊరట లభించింది. అయితే.. భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన కేసులో మాత్రం శంకర్ రావును దోషిగా తేల్చింది కోర్టు. మహిళను దూషించిన కేసులో రూ.2000 మరో కేసులో రూ.1500 జరిమానా విధించింది. కోర్టులోనే ఉన్న మాజీ మంత్రి తీర్పు వెలువడిన వెంటనే షాక్ తోస్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారని సమాచారం.