పండుగ సంతోషాలను రెట్టింపు చేసే సినిమా.పండుగ లాంటి సినిమా బంగార్రాజు అంటూ సందడి చేస్తున్నారు అక్కినేని నట వారసులు.అచ్చతెలుగు సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ,ఒక చిన్న సస్పెన్స్ పాయింట్ ఎంటర్టైన్మెంట్ వే లో చూపిస్తూ తెరకెక్కిన సినిమా ఇది..మాస్ ఎంటర్ టైనర్ దసరా బుల్లోడు విడుదలయి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా వస్తున్న సినిమా ఇది. సోగ్గాడే సంక్రాంతి విజేత అని కళ్లింతలు చేసుకుని చెబుతున్నాడు నాగ్.. అంత కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు ఈ సినిమా విషయమై..డైరెక్టర్ కూడా అంతే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.గతంలో తనకు కలిసివచ్చిన సీజన్ లోనే బంగార్రాజు సందడి చేయనున్నాడు.అభిమానులతో ఈల కొట్టించి గోల చేయించనున్నాడు. లడ్డుండలు తినిపించనున్నాడు.. ఈ సంక్రాంతికి..
అక్కినేని అభిమానులనూ,సినీ ప్రేమికులనూ హుషారెత్తిస్తున్నాయి.ఈ క్రమంలో సినిమా విడుదల వేళ మరికొన్ని విశేషాలు..
ఇక థియేటర్లకు యాభై శాతం ఆక్యుపెన్సీ ఉండడంతో సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో అన్న టెన్షన్ తప్ప మరొకటి అయితే నాగ్ లో లేదు. ఈ సినిమా అనేకాదు ప్రతి సినిమాపైనా ఈ ప్రభావం ఉండనుంది. బంగార్రాజుతో పాటు దిల్ రాజు రౌడీ బాయ్స్ రానుంది. ఇదే సమయంలో గల్లా జయదేవ్ (టీడీపీ ఎంపీ) కొడుకు గల్లా అశోక్ నటించిన హీరో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.వీటిలో ఏది సంక్రాంతి బరిలో రారాజుగా నిలవనుందో వేచి చూడాలిక.