ఫోన్ కాల్ ద్వారా బూస్టర్ డోస్ అందిస్తున్నారా..? వారిని నమ్మొచ్చా..?

-

ఒమీక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం 60 ఏళ్లు పైబడిన పౌరుల కోసం బూస్టర్ డోస్ ను ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే బూస్ట్ డోస్ కి సంబంధించి కొన్ని స్కాములు కూడా మొదలయ్యాయి. ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… బూస్టర్ డోసు తీసుకోవడానికి జనం ఆసక్తిగా ఉండటంతో సైబర్ నేరగాళ్లు దీనిని అదునుగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

బూస్టర్ డోస్ అంటూ వాళ్లకి ఫోన్ చేసి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ తర్వాత ఖాతా మొత్తం ఖాళీ అవుతోంది. మోసగాళ్లు ఎలా ఈ స్కామ్ ని చేస్తున్నారు అనేది చూస్తే… మేము ప్రభుత్వ ఉద్యోగులుమంటూ మోసగాళ్లు మొదట కాల్ చేస్తున్నారు. రెండు డోసులు తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఆ తర్వాత పేరు, వయసు, చిరునామా తదితర వివరాలని అడుగుతున్నారు.

ఎక్కువగా వీళ్ళు సీనియర్ సిటిజన్స్ ను ఎంచుకుంటున్నారు. స్లాట్ ని బుక్ చేయాలని చెప్పి తేదీ, సమయాన్ని కూడా ఇస్తున్నారు. మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది అని దానిని చెప్పమంటున్నారు. ఓటిపి చెప్పిన తర్వాత అకౌంట్ మొత్తం ఖాళీ అవుతోంది. అయితే ఈ స్కామ్ కి బలి కాకుండా ఉండాలంటే కేవలం ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి మాత్రమే మీరు స్లాట్ ని బుక్ చేసుకోండి. ఫోన్ కాల్ ద్వారా ఎలాంటి స్లాట్స్ బుక్ చేసుకోవడం కుదరదు అని మీరు తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version