మాజీ ఎంపీ హర్షకుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఉత్తర ప్రదేశ్ తరహాలోనే ఏపీలో కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ తన కేసులు నుంచి బయటపడేందుకు కేంద్రం కాళ్ళు పై పడుతున్నారని అన్నారు. రాహుల్, ప్రియాంక లు దళితుల పక్షాన చేస్తున్న పోరాటం తో కాంగ్రెస్ పార్టీ లో చేరాలని నిశ్చయించుకున్నానని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా నే దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. బీజేపీ కు కాంగ్రెస్ నే ప్రత్యామ్నాయం అని అన్నారు. బీజేపీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిన పార్టీ అని, కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన అన్నారు. కరోనా తో చాలా మంది మృతి చెందుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవాలు ప్రకటించటం లేదని విమర్శించారు. కాగా గత ఎన్నికల్లో ఆయన టీడీపీకి మద్దతు ఇచ్చారు.