కేంద్రం చట్టానికి కొత్త పేరు పెట్టిన రేవంత్…!

-

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. షాపూర్ నగర్ లో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు ఆయన. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవసాయ చట్టం రైతులకు నష్టమే అని అన్నారు. ఈ చట్టం కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉంది అని ఆయన ఆరోపించారు. రైతులను, రైతు సంఘాలను అడగకుండా తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.

ఈ చట్టం వ్యతిరేకంగా ప్రతి డివిజన్, గ్రామంలో కోటి సంతకాలు సేకరించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన కనీస మద్దతు ధర చట్టాన్ని రద్దు చేయడం అన్యాయంఅని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ చట్టాన్ని నల్ల చట్టంగా (బ్లాక్ బిల్లు)గా అభివర్ణించారు రేవంత్. రాష్ట్రం లో నిర్బంధ వ్యవసాయ విధానాన్ని ఉపసంహరించుకోవాలని.. ఆఖరి గింజ వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news