బలవంతంగా ఖాళీ చేయిస్తే ఉరేసుకుంటాం..

-

కొత్తసాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత మూడు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేస్తున్న ధర్నాలు, ఆందోళనలు రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి. నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న రైతన్నలు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కేంద్రం రైతులను రహదారులపై నుంచి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయమైన డిమాండ్లపై శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను బలవంతంగా ఖాలీ చేయిస్తే ఉరేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ తికాయత్‌ హెచ్చరించారు. రైతులపై దాడులు చేయొద్దని ఆయన వేడుకుంటూ కన్నీరు కార్చారు.

 

రైతులపై కేసులు..

ఎర్రకోట ముట్టడి ఘటనలో దాదాపుగా 300 మంది పోలీసులు గాయాలపాలైన నేపథ్యంలో కేంద్రం నిరసనకారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలో పాల్గొన్న పలువురు రైతు సంఘాల నేతలపై వివిధ రకాల కేసులు నమోదు చేశారు. దిల్లీ– యూపీ సరిహద్ధులోని ఘాజిపూర్‌లో ధర్నా చేస్తున్న రైతులందరూ గురువారం రాత్రి వరకు అందరూ ఖాళీ చేయాలని ఆ జిల్లా కలేక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. మాటవినకుండా మొండికేస్తే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. ఆందోళనకారులను ఖాళీ చేయించాలని రాకేష్‌ తికాయత్‌ కు నోటీసులు జారీ చేయడంతో భారీ మొత్తంలో అక్కడ భద్రత దళాలు మోహరించాయి. రైతు సంఘాలు మాత్రం అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా జరిగేదే లేదని స్పష్టం చేశాయి.

ఆందోళన ఆగదు..

ఈ సందర్భంగా రాకేష్‌ తికాయత్‌ మాట్లాడుతూ..పక్క ప్రణాళికతో బీజేపీ నేతలు, కార్యకర్తలు హంసాకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అరెస్టులు చేస్తాం.. కాల్పులు జరుపుతాం అంటూ భయపెట్టినా తమ ఆందోళనలు మాత్రం ఆపేదే లేదని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news