ఫ్యాక్ట్ చెక్: కేంద్ర ప్రభుత్వం నుండి ఫ్రీగా ల్యాప్టాప్స్..?

-

సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందరికీ సోషల్ మీడియా లో వచ్చే వార్తల గురించి తెలుసు. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీములు మొదలు ఉద్యోగాల వరకు ఎన్నో నకిలీ వార్తలు తరచూ వస్తూ ఉంటాయి చాలామంది నకిలీ వార్తలు ని నమ్మి నకిలీ వార్తలు నిజం అని అనుకుంటారు ఆ వార్తలో డబ్బులు కట్టమంటే డబ్బులు కట్టేస్తూ ఉంటారు. అయితే నిజానికి నకిలీ వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అకౌంట్ సున్నా అయిపోతుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది అది ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ షికార్లు కొడుతోంది మరి ఇంతకీ ఆ వార్త నిజమా నకిలీదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం… కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా విద్యార్థులకి ల్యాప్టాప్స్ ని ఇస్తోందని… ప్రైమ్ మినిస్టర్ ఫ్రీ లాప్టాప్ స్కీం 2023 కింద ఉచితంగా లాప్టాప్ లని కేంద్రం పంపిణీ చేస్తోందని ఆ వార్తలో ఉంది.

ఇది నిజమా కాదా అనేది చూస్తే ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి స్కీమ్ ఏమీ లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇలాంటి స్కీంని నడపడం లేదు ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే కాబట్టి అనవసరంగా ఇలాంటి వార్తలని నమ్మకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పైన స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news