టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. జియో గ్లాస్ పేరిట నూతన 3డీ గ్లాసెస్‌ను లాంచ్ చేసింది. బుధవారం రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో భాగంగా ఈ గ్లాసెస్‌ను పరిచయం చేశారు. దీని వల్ల 3డీ ఇంటరాక్షన్స్ చేయవచ్చు. హోలోగ్రాఫిక్ కంటెంట్ చూడవచ్చు.
వర్చువల్ రియాలిటీని ఉపయోగించే వారికి జియో గ్లాస్ పనికొస్తుంది. పూర్తిగా 3డీ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ఇందులో వీడియో కాన్ఫరెన్స్ చేసుకునే సౌకర్యం కూడా అందిస్తున్నారు. 3డీ అవతార్లను ఉపయోగించవచ్చు. ఈ గ్లాస్ బరువు 75 గ్రాములు కాగా దీనికి పర్సనలైజ్డ్ ఆడియో సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు.
జియో గ్లాస్‌లో కంటెంట్‌ను పొందాలంటే అందుకు ఓ చిన్న కేబుల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. దాన్ని గ్లాస్‌తోనే అందిస్తారు. ఆ కేబుల్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అటాచ్ చేయాలి. దీంతో భిన్న రకాల పనులు చేసుకోవచ్చు. వర్చువల్ వరల్డ్‌లో 3డీ అవతార్లతో ఇతరులతో కమ్యూనికేట్ అవొచ్చు. ప్రస్తుతం ఈ గ్లాస్ మొత్తం 25 యాప్స్‌కు సపోర్ట్‌ను ఇస్తుంది. దీన్ని విద్యార్థులు చదువుల కోసం కూడా ఉపయోగించవచ్చు.