రాష్ట్రంలో మద్యానికి ఫుల్ డిమాండ్.. ఆదాయం ఎంతో తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

తెలంగాణ రాష్ట్రంలో మద్యం డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. మద్యం తాగడం వల్ల రాష్ట్రానికి ఆదాయం రూ.కోట్లతో వస్తోంది. గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఏకంగా రూ.24,814 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇందులో వ్యాట్‌ను తీసివేయగా.. రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గడిచిన 11 నెలల్లో 2.4 కోట్ల కేసుల బీర్లు, 3 కోట్ల కేసులకు పైగా లిక్కర్ బాటిళ్లు అమ్ముడయ్యాయి.

మద్యం బాటిళ్లు
మద్యం బాటిళ్లు

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వనరులేవీ తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. కానీ ఎక్సైజ్ శాఖ తమ ఆదాయ అంచనాలు మాత్రం సులభంగా చేరుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ రాబడుల ద్వారా రూ.16 వేల కోట్లు సమకూర్చాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది. మరో నెల గడువు ఉండంగానే రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. మరో నెలలో (మార్చి) మిగిలిన వెయ్యి కోట్ల టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతేడాది లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులు మూతబడ్డాయి. ఆ సమయంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచినా మరో రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చేదని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్లు, జీఎస్‌టీ, అమ్మకపు పన్ను వంటి కీలక రంగాల నుంచి ఆదాయం కొంతమేర తగ్గినా.. మద్యం ఆదాయం పెరగడంతో రాష్ట్ర ఖజానాకు ఇబ్బందులు తప్పినట్లేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రోజుకు 5.6 లక్షల లీటర్ల బీర్లు, 8.22 లక్షల లీటర్ల లిక్కర్ బాటిళ్లను తాగేస్తున్నారు. ఇలా 11 నెలల్లో 3 కోట్ల కేసుల లిక్కర్ బాటిళ్లు, 2.4 కోట్ల కేసుల బీర్ బాటిళ్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జనవరి నెలలో రాష్ట్రంలో 28 లక్షల లిక్కర్, 33 లక్షల బీర్ బాటిళ్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,727 కోట్లు ఉందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...