నిమ్మ‌కాయా.. మ‌జాకా.. ఐటీ దాడులంటూ పేలుతున్న జోక్స్‌

-

‘ఇంతకు ఆ నిమ్మకాయ బద్దలు ఇచ్చింది ఎవరో..
ఇచ్చినందుకు, తీసుకున్నందుకు ఐటీ రైడ్స్ చేయించాలి.. ‘

‘నిమ్మ‌కాయ‌లు కొంటున్నారా… అయితే మీకు రేష‌న్ క‌ట్‌’

‘కిలో చికెన్ తెమ్మ‌న్నా తెస్తా కానీ.. నిమ్మ‌కాయ‌లు ప‌ది తెమ్మంటే ఎట్లా..’

‘ఇదిగో చూడు నేను కోటీశ్వ‌రుడిని. నిమ్మ‌కాయ‌లు కొనిపించి ల‌క్షాధికారిని చేయ‌కు’

‘బిర్యానీలో నంజుకునేందుకు నిమ్మ‌కాయ‌లు లేవు.. క‌స్ట‌మ‌ర్లు స‌హ‌క‌రించ‌గ‌ల‌రు..’

‘స్పెష‌ల్ చికెన్ విత్ సింగిల్ నీంబూ’

‘రిట‌ర్న్ గిఫ్ట్ గా ఓ రెండు నిమ్మ‌కాయ‌లు ఇచ్చారు.. వారిళ్లు నిమ్మ‌కాయ‌ల‌తో ఇలాగే క‌ల‌కాలం చ‌ల్ల‌గా ఉండాలి’

‘పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని.. నిమ్మకాయ లేకపోవడం వల్ల వెల్లుల్లిని డిప్యూటేషన్‌పై ఉంచారు. ఇప్పుడు ఈ పనికి వెల్లుల్లి బాధ్యత వహిస్తుంది’

‘ఇంత బ‌తుకు బ‌తికి నిమ్మ‌కాయ‌లేని జీవితం అయిపోయింది..’

‘భార్య :ఏమండి మనింటికి చుట్టాలు వచ్చారు కదా
చల్లగా లెమన్ జూసు
ఇద్దాం అంటే నిమ్మకాయలు లేవండి ఇప్పుడెలా

:
భర్త : ఎందుకు అంత టెన్ష‌న్‌ పడుతున్నావ్ కొత్త
విమ్ బార్ లో 100 నిమ్మకాయల శక్తి ఉందిగా దాన్ని కలిపి ఇచ్చేయ్… ‘

 

నిమ్మ‌కాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌టంతో సోష‌ల్ మీడియాలో ఇలా సెటైర్లు పేలుతున్నాయి. ఫ‌న్నీ మీమ్స్.. జోక్స్ పొట్టప‌గిలేలా చేస్తున్నాయి. క‌డుపుబ్బా న‌వ్విస్తున్నాయి. ఇందుకు సంబంధించి వింత వింత ఫొటోలు షేర్ చేస్తూ త‌మ బాధ‌ను, కోపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వేస‌వి కాలంలో దేశ వ్యాప్తంగా నిమ్మకాయలకు తీవ్ర కొర‌త ఏర్ప‌డ‌టంతో ధ‌ర‌లు భ‌గ్గుమంటున్న విష‌యం తెలిసిందే. మొద‌ట్లో ప‌ది రూపాయ‌ల‌కు ఒక నిమ్మ‌కాయ అమ్మినా.. ప్ర‌స్తుతం రెండు ఇస్తున్నారు. ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు కొనేందుకు జంకుతున్నారు. ప్ర‌జ‌ల బాధ‌లు ఎలా ఉన్నా సోష‌ల్ మీడియాలో మాత్రం నిమ్మ‌కాయ‌ల‌పై జోక్స్ పేలుతున్నాయి. వాటిని నెటిజ‌న్లు మ‌న‌సారా ఆస్వాదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news