కేసీఆర్, జగన్ ల కు థాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి

-

ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో ఇరు ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించాయి. గోదావరి, కృష్ణా బేసిన్‌లో నీటి వినియోగం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై ఇప్పటికే రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదనలు వినిపించారు. ప్రధానంగా నాలుగు అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ భేటీ తర్వాత కేంద్ర జల శక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కృష్ణా గోదావరి నదిపై ఏ ప్రాజెక్ట్ కట్టాలి అన్నా సరే దానికి అనుమతి ఇచ్చేది కచ్చితంగా అపెక్స్ కమిటీనేనని ఆయన స్పష్టం చేసారు. ఆ అధికారం అపెక్స్ కమిటీకి మాత్రమే ఉందన్న ఆయన ఈ సమావేశంలో మొత్తం నాలుగు అంశాల ఎజెండా పై నేడు చర్చించామని అన్నారు. విభజన చట్టంలోనే అపెక్స్ కమిటీ ఉందన్న ఆయన్న ఏపీ తెలంగాణా మధ్య జల వివాదాల కోసమే అపెక్స్ కమిటీ ఏర్పాటు అయిందని వివరించారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చామని ఆయన అన్నారు. అలా వివాదాలకి పోకుండా సహకరించిన ఇద్దరు సీఎంలు జగన్, కేసీఆర్ లకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news