గర్భిణులు జాగ్రత్త…

-

కరోనా వైరస్ ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు విస్తరిస్తుంది. ఈ క్రమ౦లోనే కొందరికి కరోనా సోకడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో 9 నెలల గర్భిణికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం ఇప్పుడు భయపెడుతుంది. కరోనా ప్రభావం వారికి ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. అసలు వాళ్ళను బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

ఆమెతో కలిపి గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 138కి చేరుకుంది. ఆమెను ఆమె భర్తను క్వారంటైన్ కి తరలించారు. నోయిడాలోని సెక్టర్ 121లో నివసిస్తున్న 27 ఏళ్ల గర్భిణికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేల్చారు. గత 24 గంటల్లో ప్రాంతంలో 112 కరోనా అనుమానిత కేసులు వచ్చాయని గుర్తించారు. 111 మందికి కరోనా నెగటివ్ అని వచ్చింది.

ఒక్కరికి మాత్రం పాజిటివ్ వచ్చింది. గర్భిణి మహిళలు ఎవరూ కూడా బయటకు రావొద్దని ప్రాణాలకు ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. వాళ్లకు శక్తి అవసరం అని కరోనా ఆ శక్తిని హరించి వేస్తుందని చాలా వరకు గర్భిణి స్త్రీలు ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు బయటకు రాకుండా ఉండటమే మంచిది అని హెచ్చరిస్తున్నారు. వాళ్ళ విషయంలో అధికారులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news