దారుణం… మత్తు మందిచ్చి యువతి పై గ్యాంగ్ రేప్..!

తమిళనాడు లో దారుణం చోటు చేసుకుంది. మత్తు మందిచ్చి ఓ యువతి పై ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. చెన్నై దగ్గరలోని కాంచీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ షాపులో పని చేస్తున్న ఓ 20 ఏళ్ల యువతికి గుణ శీలన్ అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయంతోనే గుణ శీలన్ యువతికి కూల్ డ్రింక్ ఇవ్వగా అతడిని నమ్మి కూల్ డ్రింక్ తాగింది.

అనంతరం యువతి స్పృహ తప్పి పడిపోవడం తో గునశీలన్ తో పాటు మరో ఐదుగురు కలిసి యువతిని కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి స్పృహ రావడం తో కేకలు వేయడం మొదలు పెట్టింది. దాంతో ఆ యువతిని కారులో నుండి బయటకు నెట్టేసి దుర్మార్గులు పారిపోయారు. రోడ్డు పై పడి ఉన్న యువతిని అతు వైపుగా వెళుతున్న ప్రయాణికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.