గంగా జలంతో కరోనాను కట్టడి చేయవచ్చా…?

-

దేశంలోనే అతి పెద్ద నది అయిన గంగా నది లాక్ డౌన్ దెబ్బకు చాలా పరిశుభ్రంగా మారింది. చాలా వరకు గంగా నదిలో ఉండే నీటిని తాగే విధంగానే ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. గంగా జలం ని చేత్తో తీసుకుని తాగినా సరే ఏ ఇబ్బంది ఉండదు అని కాలుష్య నియంత్రణ మండలి చెప్తుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు గంగా జాలానికి కొన్ని శక్తులు ఉన్నాయని కొందరు అంటున్నారు.

కరోనాను కట్టడి చేసే శక్తి ఆ నీటికి ఉంది అని కొందరు అంటున్నారు. అది ఏంటీ ఎలా అంటే… ఆర్మీలో రిటైర్ అయిన ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న అత్యుల్య గంగ అనే సంస్థ ఒక విజ్ఞప్తి చేసింది. NMCG కి ఈ విజ్ఞప్తి చేసారు. దీనితో ఆ సంస్థ కూడా కరోనా కట్టడికి ఒక ప్రతిపాదన తెచ్చింది. గంగా నది నీటిలో నింజా అనే బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు.

ఆ నీటిలో కరోనా లాంటి వైరస్ లను అంతం చేసే శక్తిమంతమైన స్ట్రెయిన్ ఉంటుందని చెప్పారు. శక్తివంతమైన వైరస్ లను సైతం అంతం చేసేస్తుంది అని చెప్పారు. దీనితో కరోనా కట్టడిలో గంగా నది నీటిని వాడితే మంచిది అని సూచనలు చేస్తున్నారు. దీని మీద కొందరు మతం కోసం ఇలాంటి ప్రచారం చేస్తున్నారు గాని అలాంటిది ఏమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news