నోయిడాలో ప్రత్యక్షమైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే..!

-

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే నిన్న రాత్రి నోయిడాలో ఓ ఆటోలో వెళుతూ తనకు కనిపించాడని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. గత రాత్రి గ్రేటర్ నోయిడాలోని సెక్టారు 71వద్ద ఎక్కూర్తి గాల్ చక్కర్ ప్రాంతం నుంచి ఆటోలో ప్రయాణించిన తమతో వికాస్ దూబే కూడా ఉన్నాడని ఓ వ్యక్తి చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు వచ్చి వికాస్ కోసం గాలింపు చేపట్టారు. సమాచారం అందించిన వ్యక్తిని ఆరా తీస్తున్నారు.

gangster vikas dubey s mother demands police to encounter her son
 

జూలై 3న కాన్పూర్‌లోని చౌబేపూర్‌ ప్రాంతంలో 8 మంది పోలీసులను కాల్చిచంపిన ఘటనలో దూబే ప్రధాన నిందితుడు. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. బుధవారం ఢిల్లీలో కనిపించినట్లు సమాచారం అందడంతో అక్కడి పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు. అంతకు ముందు ఫరీదాబాద్ ప్రాంతంలో ఓ హోటల్ లో ఉన్నాడని సీసీటీవీ ఫుటేజ్ లో వెల్లడైంది. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దూబే పారిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news