సీఎం కేసీఆర్ తొందరగా బీఆర్ఎస్ ఏర్పాటు చేయాలి ఎజెండా ప్రకటించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ కోసం కేసీఆర్ ను ప్రజలు ఒక ఆయుధంగా మార్చుకున్నారన్నారు. ఇప్పుడు దేశం కోసం కూడా ఆయుధంగా మారాలని కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణ సంక్షేమ పథకాలు చూసి మహారాష్ట్ర వాళ్లు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని వివరించారు మంత్రి గంగుల కమలాకర్. సేవలు కావాలని బడుగు బలహీన వర్గాల కోసం బీఆర్ఎస్ రావాలని మేము కోరుకుంటున్నామని చెప్పారు.
దేశం మొత్తం ఈ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వాలు రావద్దని అంతా కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ బలహీనం అయ్యిందని వివరించారు మంత్రి గంగుల కమలాకర్. దేశంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని కోరారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మత సమరష్యాలకు కృషి చేస్తుంటే..బిజెపి వాళ్ళు వినాయక నిమార్జనంలో మత ఘర్షణలు చేయాలని చూశార్నారు.