లండన్ వీధుల్లో భార్య, కూతురుతో కలిసి గంగూలీ డాన్స్.. వీడియో వైరల్

-

భారత జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబ సభ్యులతో కలిసి లండన్ నగర వీధుల్లో సందడి చేశారు. ఈ మేరకు గంగూలీ డాన్స్ చేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంది. గంగూలీ తన 50 వ పుట్టినరోజు వేడుకలను లండన్ లో ఘనంగా జరుపుకున్నాడు. అడ్వాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం ముంబైలో జరుపుకున్నారు దాదా.

గురువారం రాత్రి లండన్లో మరోసారి బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్ వీధుల్లో భార్య డోనా, కూతురు సనాతో పాటు మరి కొందరు మిత్రులతో కలిసి బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేశారు. కూతురు సనా ఎదురుగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాలోని టైటిల్ సాంగ్ కు చిందులేస్తూ పరవశించిపోయారు. గంగూలీ లోని డాన్స్ ఆంగిల్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news