రుషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజు.. జగన్‌ ప్రభుత్వంపై గంటా విమర్శలు

-

సాధారణంగా సముద్రాన్ని మనం అందరం ఉచితంగా చూడొచ్చు. విశాఖలో కూడా అన్ని ప్రాంతాల్లో ఉచితమే కానీ ఆ ఒక్క రిషికొండ తీరం వద్ద మాత్రం బీచ్ చూడాలంటే ఇరవై రూపాయల ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిందే. ఈ నెల 11 నుంచి రుషికొండ వద్ద బీచ్‌కు 20 రూపాయల ఎంట్రీ టికెట్ పెట్టాలని పర్యాటక శాఖా తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘విశాఖలో తాకట్టు పెట్టాలనుకున్నవన్నీ పెట్టేశారు. అమ్మివేయాలనుకున్నవన్నీ అమ్మేశారు. కూల్చాలనుకున్నవి కూల్చేశారు. వేయాలనుకున్న పన్నులన్నీ వేసేశారు. ఇప్పుడేమో బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు’ అని ట్వీట్ చేశారు.

Ganta Srinivasa Rao to meet Guv for acceptance of resignation | India News  – India TV

విశాఖ అంటే అందమైన బీచ్ లు గుర్తుకు వస్తాయని, సముద్రతీరంలో కాసేపు సేదతీరితే ఒత్తిడి తగ్గుతుందని విశాఖవాసులు సాయంత్రం సమయంలో అలా బీచ్ కు వస్తుంటారని, కానీ ఇక నుండి బ్లూ ఫాగ్ గా గుర్తింపు కలిగిన రుషికొండ బీచ్ కు వెళ్లాలంటే రూ.20 ఎంట్రీ ఫీజు పెట్టడంతో ప్రకృతి ప్రేమికుల నుండి తీవ్ర అసహనం వ్యక్తమవుతోందని గంటా అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజు కింద బైక్స్ కు రూ.10, కార్లకు రూ.30, బస్సులకు రూ.50 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడేమో బీచ్ లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు, తీరం అందాలు ఆస్వాదించాలంటే ప్రభుత్వమే ఆధునాతన హంగులతో బీచ్ లను అభివృద్ధి చేసి పర్యాటకులను, నగరవాసులను ఆకట్టుకోవాల్సింది పోయి ఎంట్రీ ఫీజులు పెట్టి పర్యాటకుల నడ్డి విరుస్తున్నారన్నారు. ఎంట్రీ టిక్కెట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news