టీడీపీ కి రాజీనామా చేయనున్న గంటా…?

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత మంది ఎక్కువగా కనపడకపోయినా సరే పదే పదే వార్తల్లో ఉంటూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పే నాయకులు గంటా శ్రీనివాసరావు. రాజకీయంగా ఆయన అత్యంత బలమైన నేత కూడా. సొంత నియోజకవర్గం అంటూ ఆయనకు ఏదీ లేకపోయినా ఏ నియోజకవర్గ౦లో పోటీ చేసినా సరే విశాఖలో ఆయన గెలుస్తూ ఉంటారు. ఇప్పుడు విశాఖ ఉత్తరం నుంచి ఆయన ఎమ్మెల్యే గా ఉన్నారు. ఇక ఇప్పుడు టీడీపీ కి కూడా ఆయన దూరంగానే ఉన్నారు. రాజకీయంగా ఇప్పుడు ఆయన అవసరం కొంత మందికి ఉంది.

రాజధాని తరలింపులో గంటా మద్దతు కూడా ఉంది అనే ప్రచార౦ జరుగుతుంది. గంటా శ్రీనివాసరావు పార్టీ మారితే తమకు ఫలితం ఉంటుంది అనేది వైసీపీ నాయకుల భావన గా చెప్పుకోవచ్చు. వైసీపీ నాయకులు చాలా మంది గంటా కోసం ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆయన మాత్రం పార్టీ మారడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే గంటా ఇప్పుడు టీడీపీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి ఏ పార్టీ లో కూడా ఉండటానికి మొగ్గు చూపకుండా సొంతగా వ్యవహరించాలి అని ఉత్తరాంధ్ర లో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు.

ఆయన సహకారం తో పైకి వచ్చిన నేతల సంఖ్యా అక్కడ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ అందరి తో కలిసి ఒక వర్గాన్ని తయారు చేసే ఆలోచనలో గంటా శ్రీనివాసరావు ఉన్నారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజకీయాల్లో గంటా సౌమ్యుడు. ఆయనకు వివాదాలు చాలా తక్కువ. కాని సంచలన నిర్ణయాలు తీసుకునే నేత కూడా. ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో ముగ్గురు నేతలను బయటకు తీసుకుని వస్తారు అని వారిలో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news