ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ లేదా ? తెలంగాణాలో ఫుల్ ఖుషీ !

టీడీపీ సీనియర్ నేత మరియు మాజీ విద్యాశాఖామంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు జగన్ ప్రభుత్వంపై మరోసారి సెటైరికల్ కామెంట్స్ చేశారు. గంటా తాజాగా మాట్లాడుతూ మన పొరుగు రాష్ట్రము తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు వరుసగా ఏ శాఖలో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా నోటిఫికేషన్ లను ఇస్తూ నిరుద్యోగులకు శుభవార్తలు అందిస్తోంది. అంతెందుకు రీసెంట్ గా మొత్తం 5096 టీచర్ పోస్ట్ లను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది అని గంటా శ్రీనివాసరావు సెలవిచ్చారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి ? జాబ్ కేలండర్ లు సంవతసరం సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పిన జగన్ ఇప్పుడేమి చెబుతాడు అంటూ ప్రశ్నించారు. అస్సలు టీచర్ పోస్ట్ లను భర్తీ చేయడం అనే విషయన్ని మరిచిపోయారు జగన్ అంటూ విమర్శించారు.

మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు మెగా డీఎస్సీ విడుదల చేశామని.. ఇపుడు జగన్ సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు గంటా శ్రీనివాసరావు.