దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ తో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ₹1000 దాటగా… కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి షాక్ ఇచ్చాయి ఇంధన సంస్థలు. ప్రస్తుతం ఉన్న డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచుతూ విద్యా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ డిపాజిట్ ప్రస్తుతం 14 వందల యాభై రూపాయలు ఉండగా దానిని 22 వందల రూపాయలకు పెంచారు. 5 కిలోల సిలిండరు డిపాజిట్ నో 800 రూపాయల నుంచి 2250 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇకపై రెగ్యులేటర్ కు కూడా 250 రూపాయలు వసూలు చేస్తారు. పెంచిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని ఇంధన సంస్థలు తెలిపాయి. ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించ బోవని… కొత్త కనెక్షన్ తీసుకునేవారు కొత్త ధరలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి ఇంధన సంస్థలు.