భార్యలు వద్దని పూజలు చేసిన భర్తలు..ఎక్కడో తెలుసా?

-

సినిమాల ప్రభావం మనుషుల మీద ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..రోజు రోజుకు మనుషులు వింతగా ప్రవర్తిస్తున్నారు..సినిమాలలో లాగానే ఇప్పుడు ఘటన వెలుగు లోకి వచ్చింది.భార్యా బాధితులు అంతా కలిసి మాకు భార్యలు వద్దు అని ఒక ప్రత్యేక పూజలు చేశారు..ఇవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఈ విషయం గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో తమకు చుక్కలు చూపించే భార్యలు మళ్లీ జీవిత భాగస్వాములుగా రావద్దని కొందరు పురుషులు మహారాష్ట్రలో ఆందోళనకు దిగారు.ఇంట్లో తమ భార్యల ద్వారా ఎదుర్కొనే అన్యాయానికి వ్యతిరేకంగా తమ గళం విప్పేందుకు కొత్త చట్టాలు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సోమవారం రావి చెట్టు చుట్టు 108 ప్రదక్షిణలు చేశారు. మళ్లీ అదే భార్య జీవిత భాగస్వామిగా రావొద్దని ప్రార్థించారు. అసలు ఏం జరిగిదంటే..

తమ భార్యలతో సంతోషంగా లేని కొందరు పురుషులు తమ మనోవేదనను లేవనెత్తడానికి కొన్నేండ్ల క్రితం ఔరంగాబాద్‌లో భార్యా బాధితుల ఆశ్రమాన్ని ఏర్పాటుచేశారు. మంగళవారం వారంతా ఆందోళనకు దిగారు. మంగళవారం వట్‌ పూర్ణిమా సందర్భంగా మహిళలు రావిచెట్టును మొక్కి తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తారు. ఏడు జన్మలకు అతడే జీవిత భాగస్వామిగా రావాలని వేడుకుంటారు. వట్‌ పూర్ణిమాకు ఒక రోజు ముందుగా సోమవారం రావిచెట్టు వద్ద పురుషులు ప్రత్యేక పూజలుచేసి, మళ్లీ అదే భార్య తమకు వద్దని దేవున్ని ప్రార్థించినట్టు ఆశ్రమ వ్యవస్థాపకుడు భారత్‌ ఫులారే తెలిపారు..మహిళలకు ఎన్ని చట్టాలను అమలు చేసిన కూడా వాళ్ళు ఇలానే ఉన్నారని,ఇప్పుడు పురుషుల కోసం కొత్త చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చెస్తున్నారు.. ఈ విషయం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news