గుడ్ న్యూస్..వంట గ్యాస్ పై రూ.312 డిస్కౌంట్…?

-

దేశంలో పెరుగుతున్న ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు, పెట్రోలో డీజిల్ తో పాటూ వంట గ్యాస్ ధ‌ర‌లు సైతం ఆకాశాన్ని తాక‌డంతో సామాన్యులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే పెట్రోల్ డీజిల్ ధ‌ర‌ల్ భారీగా పెంచి కాస్త త‌గ్గిస్తూ కేంద్రం ఇటీవ‌ల గుడ్ న్యూస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు వంట గ్యాస్ ధ‌ర‌ల‌ను సైతం త‌గ్గించే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వంట గ్యాస్ సిలిండ‌ర్ పై రూ.312 రాయితీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం అందుతోంది.

gas
gas

ఇక సాధార‌ణ వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర వెయ్యి రూపాయ‌ల‌కు చేరుకోగా వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.2వేల మార్కును తాకింది. ఇక ఇప్ప‌డు గ్యాస్ సిలిండర్ పై రాయితీ ప్ర‌క‌టిస్తే ఏడు వంద‌ల రూపాయల‌కు వంట గ్యాస్ అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం గ్యాస్ సిలిండ‌ర్ పై కేవ‌లం రూ.40 రాయితీ ఇస్తున్నారు. దాంతో తీవ్ర‌వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ధ‌ర‌లు త‌గ్గిస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news