తెలంగాణలో మళ్ళీ చిరుత కలకలం.. వ్యక్తి మీద దాడి !

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో చిరుతల సంచారం కలకలం రేపుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామ శివారులో గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసింది. అందులో చాలా గొర్రెలను చిరుత హత మార్చింది. అయితే గొర్రెల పై దాడి చేస్తున్న చిరుతను గొర్రెల కాపరి మల్లేష్ అడ్డుకున్నాడు, దీంతో మల్లేష్ పై దాడి చేసిన చిరుతపులి అక్కడి నుండి పారిపోయింది. అయితే మల్లేష్ పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గానే ఉంది.

ఆయనను హాస్పిటల్ కు తరలించారు. ఇక మొన్న కూడా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ సంచరించిన చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి చర్యలు మొదలు పెట్టారు. అందుతున్న సమాచారం మేరకు చిరుత సంచారాన్ని పసిగట్టేందుకు గాను ఇరవై ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాజేంద్ర నగర్ లో ఉన్న ఫాతిమా ఫామ్  హౌస్లో ఈ కెమెరాలను అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఒక వేళ చిరుత సంచారం కెమెరాలలో రికార్డు అయితే బొన్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...