Gautham Menon: ఆ సినిమా గురించి నాకు తెలీదు. అందులో న‌టించింది నేనేనా ? అన్బు సెల్వన్ పోస్ట‌ర్ పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

Gautham Menon: ల‌వ్ స్టోరీల‌ను.. స్టైలిష్ గా తెర‌కెక్కించ‌డంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించిన డైరెక్ట‌ర్ గౌతమ్ మీనన్. ఏం మాయ చేసావే .. సినిమాతో ప్రేక్షకులను నిజంగానే మాయచేసాడు ఈ స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్. ఒక్క లవ్ స్టోరీస్ లోనే కాదు యాక్షన్ సినిమాలతోను ఆకట్టుకున్నాడు గౌతమ్ మీనన్. అలాగే గత కొద్ది ఏండ్లుగా ఆయ‌న డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు. తన సినిమాలతో పాటు వేరే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కనిపించి అలరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళ్ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్.. అన్బు సెల్వన్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి హీరో విష్ణు విశాల్ – దర్శకుడు పా.రంజిత్ .

తాజాగా దీపావళి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ పోస్టర్ పై గౌతమ్ మీనన్ అందరికీ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా పోస్టర్ ని షేర్ చేస్తూ.. ఈ సినిమా గురించి నాకు తెలీదు. అస‌లూ నేను నటించిన సినిమానా.. ఇది నిజంగా ఆశ్చ‌ర్యంగా ఉంది. ఈ సినిమాలో ఎలా నటిస్తున్నానో నాకు తెలియదు. ఈ పోస్టర్ లో ఉన్న డైరెక్టర్ కూడా నాకు ఎవరో తెలియదు, ఆ డైరెక్టర్ మునుపెన్నడూ కలవలేదు. ఇలాంటివి చాలా తేలికగా చేయడం షాకింగ్..భయానకం“ అని ట్వీట్ చేశారు.

ఇప్పూడు ఈ స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్లు తమిళ్ ఇండస్ట్రీలో ఓ సారిగా.. హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ కామెంట్ల పై చిత్ర నిర్మాణ సంస్థ ఎంఎం స్టూడియోస్ స్పందించింది. తన యూట్యూబ్ ఛానెల్ లో కౌంటర్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను విడుదల చేసింది.
ఈ వీడియో క్లిప్ లో వివేక్, ప్రసన్నతో పాటు గౌతమ్ నటించిన‌ట్టు ఉంది. ఈ వీడియో క్లిప్ ను చూసినా.. నెటిజ‌న్లు గౌతమ్ మీనన్ కామెంట్స్ ను తప్పు పట్టారు. అతను నిజంగా అన్బు సెల్వన్ లో భాగమని నిరూపణ అయ్యింది. అయితే ఈ వీడియో క్లిప్ పై గౌతమ్ మీనన్ స్పందించాల్సి ఉంది. గతంలో కూడా ఇదే సినిమాని గౌతమ్ మీనన్ ఫొటోతో అనౌన్స్ చేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news