గాంధీ ఆస్పత్రిలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు : సూపరింటెండెంట్‌ రాజారావు

-

చైనా, అమెరికా వంటి దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఇండియా అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్రం మరోసారి కరోనా మార్గదర్శకాలు విడుదల చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.  ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.

ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజారావు సూచించారు. చైనా, జపాన్‌, కొరియా, యూఎస్‌లలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఎఫ్‌ 7 (BF.7) విజృంభిస్తోన్న తరుణంలో ప్రజలు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. గాంధీ ఆసుపత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్‌ పరీక్షలు చేస్తున్నట్లు రాజారావు వెల్లడించారు.

ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాల్లో గుర్తించిన బిఎఫ్.7 వేరియంట్ భారత్‌కూ వ్యాపించింది. తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ నెలలోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా మరో కేసు ఒడిశాలో వెలుగు చూసినట్లు తెలిపాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని కేంద్రం సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news