అదిరే కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. నెలకు భార్యాభర్తలు రూ.10వేలు పొందవచ్చు..!

-

చాలా మంది కేంద్రం అందించే స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ని పొందుతున్నారు. అసంఘటిత రంగంలోని వ్యక్తుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు, వృద్ధాప్యంలో ఆర్థిక తోడ్పాటు కోసం కూడా కేంద్రం స్కీము ని తీసుకు వచ్చింది. అటల్ పెన్షన్ యోజన పేరు తో స్కీమ్ ని తీసుకు వచ్చారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీముని తీసుకు వచ్చారు. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ద్వారా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహణ లో ఈ స్కీము వర్క్ అవుతుంది.

నెలవారీ రూ.1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ ని ఈ స్కీము తో పొందవచ్చు. ఈ స్కీము కోసం ఇప్పటికే 5 కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులందరూ ఈ స్కీము లో చేరచ్చు. 2022 అక్టోబర్‌లో ప్రభుత్వం దీనికి సంబంధించి కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చింది. ఆదాయ పన్ను చెల్లింపుదారులుగా వున్నా వ్యక్తులు పథకంలో చేరడానికి అర్హులు అవ్వరు. సబ్‌స్క్రైబర్‌లు చేస్తున్న కాంట్రిబ్యూషన్‌లో 50 శాతం లేదా సంవత్సరానికి రూ.1,000 లో తక్కువ దాన్ని ప్రభుత్వం కాంట్రిబ్యూట్‌ చేస్తుంది.

రూ.1,000 నుంచి రూ.5,000 వరకు హామీతో కూడిన కనీస నెలవారీ పెన్షన్‌ను ఇలా ఈ స్కీము తో పొందవచ్చు. సబ్‌స్క్రైబర్‌లు 60 సంవత్సరాల వయస్సు నుంచి జీవితకాల కనీస హామీ పెన్షన్‌ను అందుకుంటారు. సబ్‌స్క్రైబర్‌, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణిస్తే పెన్షన్ కార్పస్ నామినీకి తిరిగి ఇస్తారు. 60 సంవత్సరాల వయస్సులో, సబ్‌స్క్రైబర్‌లు పెన్షన్ సంపద 100 శాతం యాన్యుటైజేషన్‌తో స్కీము నుండి ఎగ్జిట్‌ కావొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news