LIC: రూ. 256తో ఏకంగా రూ. 54 లక్షలు.. ఎలా అంటే..?

-

ప్రతీ ఒక్కరు కూడా నచ్చిన పథకాల్లో డబ్బులని పెడుతున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. ప్రతి వ్యక్తి జీవితంలో పొదుపు ఎంతో అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ఆ డబ్బులు ఉంటాయి. అలానే భవిష్యత్తు అవసరాలను తీర్చడంలో ఈ పొదుపు సాయపడుతుంది. సురక్షితమైన పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం మంచిది. లైఫ్ ఇన్యూరెన్స్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. ఈ పాలసీలతో మంచిగా లాభాలు ఉంటాయి.

Life Insurance Corporation

ఎల్ఐసీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుత పథకాలను అందిస్తూనే వుంది. ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల్లో జీవన్ లాభ్ పాలసీ ఒకటి. ఇది ఎండోమెంట్ పాలసీ. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. జీవన్ లాభ్ ప్లాన్ లో ఇన్సూరెన్స్‌తో పాటే సేవింగ్స్ కూడా చెయ్యచ్చు. రోజుకు రూ. 256 లెక్కన నెలకు రూ. 7,960 చొప్పున పెడుతూ ఉంటే మెచ్యూరిటీ సమయానికి చేతికి రూ.54 లక్షలు వస్తాయి. ఈ పాలసీ హోల్డర్ చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతుంది.

కనీస వయసు 18 ఉంటే ఈ పాలసీకి అర్హులే. 59 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎప్పుడైనా ఇందులో చేరొచ్చు. 25 ఏళ్ల వయసున్న వ్యక్తి రూ.25 లక్షల పాలసీని ఎంచుకున్నట్లయితే ఇన్వెస్టర్ 16 సంవత్సరాల పాటు ప్రీమియం కట్టాల్సి వుంది. మెచ్యూరిటీ పీరియడ్ 25 సంవత్సరాలు. పాలసీ ప్రారంభించిన 25 ఏళ్లకు మొత్తం నగదు చేతికి వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి చేతికి ఏకంగా రూ.54 లక్షలు వస్తాయి.

ఈ ప్రీమియం ప్లాన్‌లో భాగంగా నెలకు రూ.7960 చొప్పున పే చెయ్యాలి. జీఎస్టీ కూడా వర్తిస్తుంది. 25 సంవత్సరాల వ్యవధిలో ఇన్వెస్టర్ రూ.14,67,118 వరకు పే చెయ్యాల్సి వుంది. మెచ్యూరిటీ సమయానికి దీనిని 3 రెట్లకు పైనే అంటే రూ.54 లక్షల వరకు మీరు పొందవచ్చు. ఫైనల్ అడిషనల్ బోనస్‌గా మరో రూ. 9 లక్షలు వస్తాయి. 10, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఇలా వేర్వేరు టెన్యూర్స్ కూడా ఈ పాలసీ లో వున్నాయి. పాలసీ టర్మ్ ముగియక ముందే పాలసీదారుడు చనిపోతే నామినీకి ఈ బెనిఫిట్స్ ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news