పోస్ట్ ఆఫీస్ నుండి అదిరే స్కీమ్..రూ. 95 పెట్టుబడితో రూ. 14 లక్షలు..!

-

చాలా మంది వారికి నచ్చిన స్కీముల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా డబ్బులు పెడితే మంచిగా లాభాలని పొందొచ్చు. పోస్ట్ ఆఫీస్ లో కూడా చాలా మంది డబ్బులు పెడుతూ వుంటారు. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పోస్ట్ ఆఫీస్ లో డబ్బులని పెడుతూ వుంటారు. ఇందులో డబ్బులు పెడితే రిస్క్ ఉండదు. చాలా మంది రిస్క్ లేని పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు.

పోస్ట్ ఆఫీస్ తీసుకు వచ్చిన స్కీమ్స్ లో గ్రామీణ పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ కి సంబదించిన వివరాలు చూద్దాం. గ్రామ సుమంగల్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. భారతదేశంలోని గ్రామీణ జనాభా కోసం దీన్ని తీసుకు వచ్చారు. ప్రతి రోజూ 95 రూపాయల చిన్న పెట్టుబడి పెడితే పెట్టుబడిదారులు రూ. 14 లక్షల ఫ్యాట్ డిపాజిట్‌ని చేయవచ్చు. గ్రామ్ సుమంగల్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పోస్టాఫీసు మనీ బ్యాక్ ప్లాన్. కేవలం గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రమే ఈ స్కీమ్ కి అర్హులు.

ఈ మనీ బ్యాక్ స్కీమ్ తో ఎప్పటికప్పుడు రిటర్న్‌లు పొందొచ్చు. మరణ ప్రయోజనం ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే నామినీకి హామీ మొత్తం ప్రయోజనం ఉంటుంది. 19 నుండి 40 సంవత్సరాల వయస్సు వాళ్ళు వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పథకంలో 15 లేదా 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు.

పెట్టుబడిదారు రూ. హామీ మొత్తాన్ని పొందుతారు. 15 సంవత్సరాలకు పాలసీని తీసుకుంటే మీరు 6 సంవత్సరాల, 9 సంవత్సరాలు, 12 సంవత్సరాల పాలసీలో 20 శాతం డబ్బును తిరిగి పొందుతారు. మిగిలిన 40 శాతం మొత్తం మెచ్యూరిటీ తో వస్తుంది. మరోవైపు, మీరు 20 సంవత్సరాలకు పాలసీని కొనుగోలు చేస్తే 8వ సంవత్సరం, 12వ సంవత్సరం, 16వ సంవత్సరంలో తిరిగి 20 శాతం వస్తుంది. మెచ్యూరిటీ 20వ సంవత్సరంలో మిగిలిన 40 శాతం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news