కేంద్రం గుడ్ న్యూస్.. రూ.100 కడితే రూ.16 లక్షలు… పూర్తి వివరాలు ఇవే..!

-

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు వారికి నచ్చిన స్కీముల్లో డబ్బులని పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా మంచి స్కీమ్ లో డబ్బులని పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ వివరాలు చూడాల్సిందే. రోజుకు రూ.100 పొదుపు చేస్తే రూ. 16 లక్షలు పొందచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. అందులో సుకన్య సమృద్ధి స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకంలో చేరితే సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. కేవలం పదేళ్లలోపు వయసులో ఉన్న ఆడ పిల్లలకు మాత్రమే ఈ స్కీము వర్తిస్తుంది.

బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి పాప పేరుపై సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరవచ్చు. రూ. 250 మొత్తంతో కూడా మీరు ఈ స్కీము లో చేరవచ్చు. ఈ స్కీము లో మీరు ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. ఒకే మొత్తాన్ని ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మెచ్యూరిటీ సమయంలో అదిరే రాబడి మీకు వస్తుంది. 8 శాతం వడ్డీ రేటు వస్తోంది. మూడు నెలలకు ఒకసారి వీటిని మారుస్తుంది కేంద్రం. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. స్కీమ్‌లో చేరిన తర్వాత పదిహేనేళ్ళు డబ్బులని పెట్టాలి.

ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వున్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తోంది. సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరిన తర్వాత ఏడాదికి రూ. 1.5 లక్షలు కడుతూ ఉంటే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 67 లక్షలు వస్తాయి. రోజుకు రూ. 100 పొదుపు చేసి నెల చివరిలో రూ. 3 వేలు సుకన్య సమృద్ధి అకౌంట్‌లో జమ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 16 లక్షలు వస్తాయి. రోజుకు రూ. 50 పొదుపు చేస్తే రూ. 8 లక్షలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news