మద్యం మత్తులో రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి

-

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే రెండేళ్ల పసిపాపను కడతేర్చాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కర్కశంగా చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన ఉదంతమిది. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నవులూరు ఎంఎస్‌ఎస్‌ కాలనీకి చెందిన మునగపాటి గోపికి మూడేళ్ల క్రితం మౌనికతో వివాహమైంది. వీరికి రెండేళ్ల క్రితం లక్ష్మీపద్మావతి పుట్టింది. ఆరు నెలల కిందట మరో పాప జన్మించింది. ఇద్దరూ బాలికలే పుట్టారంటూ గోపి తరచూ మద్యం తాగి వచ్చి తల్లీకుమార్తెలపై దాడికి పాల్పడేవాడు. సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న లక్ష్మీపద్మావతిని చేయి పట్టుకుని ఈడ్చి నేలకేసి కొట్టాడు.

తీవ్రంగా గాయపడిన కుమార్తెను తల్లి స్థానికుల సహకారంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటి దగ్గర మద్యం మత్తులో వీరంగం వేస్తున్న గోపిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news