LIC: రూ.1,200 కడితే.. ఒకేసారి రూ.25 లక్షలు….!

-

చాలా మంది వివిధ స్కీముల్లో డబ్బులని పెడుతూ వుంటారు. మీరు కూడా మీకు నచ్చిన స్కీమ్ లో డబ్బులని పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఎల్ఐసీ అందిస్తున్న స్కీమ్ ని చూడాలి. పలు రకాల పాలసీలు ని ఇస్తోంది LIC. టర్మ్ ప్లాన్స్ దగ్గరి నుంచి చిల్ట్రన్స్ ప్లాన్, మనీ వరకు వివిధ పాలసీలు అందుబాటులో ఉంటున్నాయి. LIC పాలసీల్లో పెన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అందువల్ల మీకు నచ్చిన పాలసీ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్ఐసీ అందిస్తున్న ఎండోమెంట్ పాలసీ జీవన్ ఆనంద్ గురించి తెలుసుకుందాం. ఈ పాలసీ తో రాబడి, రక్షణ ఉంటుంది.

రిస్క్ ఏమి ఉండదు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు వయసు ఉన్న వాళ్ళు ఈ పాలసీ ని తీసుకోవచ్చు. ఇక ఈ పాలసీ టర్మ్ గురించి చూస్తే.. 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుంది. నచ్చిన టెన్యూర్ ని సెలెక్ట్ చెయ్యవచ్చు. వయసు, మీరు ఎంచుకునే టెన్యూర్ ని బట్టీ నెల నెల చెల్లించాల్సిన ప్రీమియం కూడా మారుతుంది. ఇక ఈ పాలసీ తో ఎంత వస్తుందో చూస్తే.. 30 ఏళ్లు వాళ్ళు పాలసీ టర్మ్ 35 ఏళ్లు ఎంచుకున్నారు రూ. 5 లక్షల మొత్తానికి మీరు బీమా పాలసీ ని తీసుకున్నారు.

నెల కి రూ. 1242 ప్రీమియం పడుతుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ప్రీమియం ని పే చెయ్యచ్చు. మెచ్యూరిటీ సమయం లో చేతికి దాదాపు రూ. 25 లక్షల వరకు లభిస్తాయి. బీమా మొత్తం రూ. 5 లక్షలు, బోనస్ రూ. 8 లక్షలు, ఎఫ్ఏబీ రూ. 11.5 లక్షలు వస్తాయి. పాలసీ మెచ్యూరిటీ తర్వాత కూడా లైఫ్ కవర్ కొనసాగుతూ వస్తుంది. అదే పాలసీదారుడు మరణిస్తే.. డెత్ క్లెయిమ్ లభిస్తుంది. బీమా మొత్తం, బోనస్ ఎఫ్ఏబీ కలిపి ఇచ్చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news