BREAKING : బాలానగర్ లో ఫ్లై ఓవర్ పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌ మహా నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ బాలానగర్ లో ఫ్లై ఓవర్ పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భూక్యా అశోక్ అనే వ్యక్తి వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. రేష్మా బేగంను అనే మహిళను ప్రేమ వివాహం చేసుకొని, కోమటి బస్తీలో నివసిస్తున్నాడు.

ప్రతి రోజు మద్యం సేవించి భార్యను కొడుతూ, మద్యం మత్తులో తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటమే కాకుండా, గతంలో రెండు సార్లు బ్లేడుతో కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ రోజు ఉదయం మద్యం సేవించి భార్యను కొట్టి, ఆత్మహత్య చేసుకుంటానని ఇంటిలో నుండి వెళ్ళిపోయాడు. బాలానగర్ ఫ్లై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.