లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మంది ప్రయోజనం కలుగుతోంది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకు వచ్చిన పథకాలలో ఎల్‌ఐసీ ఆధార్ శిలా స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన చక్కటి లాభాలని పొందొచ్చు.
ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మహిళలు కనిష్టంగా రూ.75 వేలు, గరిష్టంగా రూ.3 లక్షల పాలసీలను కొనుగోలు చెయ్యచ్చు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీనే. ఒకవేళ కనుక పాలసీదారుడు మరణిస్తే.. అప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తారు. ఇక ఎవరు ఈ స్కీమ్ కి అర్హులు ఎవరన్నది చూస్తే.. 8 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల వరకు మహిళలు ఎవరైనా ఈ స్కీమ్ లో అర్హులే.
ఈ స్కీమ్ లో మీరు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేసేయచ్చు.రోజుకు కేవలం రూ.58, నెలకు రూ. 1740 చొప్పున ఇందులో ఇన్వెస్ట్ చేసి చక్కటి లాభాన్ని పొందొచ్చు. నెలకు రూ. 1740 చొప్పున అంటే సంవత్సరానికి రూ.21,918 కట్టాలి. 20 సంవత్సరాలకి రూ. 4,29,392 అవుతుంది. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి మీకు రూ. 7,94,00 వస్తాయి. రోజుకు రూ.29 ఇన్వెస్ట్ చేస్తే రూ.2,14,000 అవుతుంది. మీ రిటర్న్స్ రూ.3,97,000 అవుతుంది.