పోలీస్‌ స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. రూ.కోటి వాహనాలు ఆహుతి

-

విశాఖ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలను కంచరపాలెం పీఎస్‌ వెనుక పార్క్ చేసి వుంచారు. ఈ క్రమంలో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ వాహనాలన్నీ ఖాళీ బూడిదయ్యాయి. ఆకతాయిలు వాహనాలకు నిప్పు పెట్టారా లేక.. సమీపంలోని ఇండస్ట్రియల్‌ డంపింగ్‌ యార్డులో వ్యర్థాల నుంచి మంటలు వ్యాపించి అంటుకున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో 27 ద్విచక్రవాహనాలు, నాలుగు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. అగ్నికి ఆహుతైన వాహనాల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇటీవల ట్రయల్‌ రన్‌ కోసం విశాఖ వచ్చిన వందే భారత్‌ రైలుపై కంచరపాలెం ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈకేసును పోలీసులు, రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్న వాహనాలు అగ్నికి ఆహుతవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news