బద్దకాన్ని వదిలించుకోవడానికి చేయాల్సిన అతి ముఖ్యమైన పనులివే..

-

గెలవాలన్న కోరిక ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే గెలుపు శిఖరంపై జెండా ఎగరవేస్తారు. మిగతా వాళ్ళలో కొందరు శిఖరం ఎక్కుతూ కనిపిస్తారు. ఏదో ఒక రోజు వాళ్ళు కూడా జెండా పాతుతారు. కొందరుంటారు. శిఖరం ఎక్కాలని అనుకుంటారు. ఎక్కినట్లు ఊహించుకుంటారు. కానీ ఎక్కరు. కారణం బద్దకం. ఎక్కాలంటే కావాల్సిన శక్తి ఉన్నా కూడా ఇవాళ వద్దు, రేపెక్కుదాం, ఇదెంత సేపు చాలా ఈజీ.. అని చెప్పుకుంటూ చివరాఖరికి ఎక్కకుండానే జీవితంలో రాజీ పడిపోతారు.

ఇంకొందరుంటారు. ఎన్ని సార్లు ఎక్కాలని అనుకున్నా ఎక్కలేరు. అడుగు వేస్తారు. ఆగిపోతారు. వీళ్ళకి గెలవాలని ఉంటుంది. కానీ అడుగు వేయరు. మరి ఇలాంటి సమస్యలున్న వారు గెలుపు గురించి కాదు, బద్దకాన్ని ఎలా జయించాలనేది ఆలోచించాలి. బద్దకం జయించాలంటే కావాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి చర్చిద్దాం.

చిన్న చిన్న లక్ష్యాలని ఎంచుకోండి

పెద్ద పెద్ద లక్ష్యాలని ఊహించుకుని వాటిని అందుకోలేక ఎప్పటికైనా అందుతుందన్న భ్రమలో బ్రతికేయకండి.పెద్ద లక్ష్యాలు మీపై తీవ్ర ఒత్తిడిని చూపిస్తాయి. ముందుగా మీకు చేతనయ్యే చిన్న లక్ష్యాలను సాధించండి. అవే పెద్ద వాటికి దారి తీస్తాయి.

పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకోవద్దు.

లక్ష్యాలు సాధించే ప్రతీవాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారని నువ్వు కూడా అలాగే ఉండాలని అనుకోవద్దు. మనం మనుషులం. తప్పులు చేస్తాం. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితం సాగుతుంది.

నిన్ను నువ్వు ఎప్పుడూ తిట్టుకోవద్దు.

ఈ రోజు ఎంత చిన్న పనిచేసినాఅ అది నీవల్లే అయ్యింది కాబట్టి, నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటూ ఉండు. ఛ.. ఇలా చేసానేంటి అని ప్రతీసారీ నిన్ను నువ్వు తిట్టుకోవడం కరెక్ట్ కాదు.

పనిచెయ్

ఏదైనా సరే ఇప్పుడే చేయండి. ఒక పని అనుకున్నాక, రేపు చేద్దాంలే అన్న ఆలోచన రావద్దు. అలా రావద్దంటే ఇప్పుడే చెయ్యాలి.

నీ గొప్పలు నువ్వే గుర్తించాలి

ప్రస్తుత ప్రపంచంలో మరొకరిని గుర్తించే సమయమే ఎవరికీ లేదు. అందుకే నీ గొప్పలని
గుర్తించి నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాల్సిందే.

ఈ పనులు చేస్తే బద్దకం దూరమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news