LIC నుండి అదిరే స్కీమ్.. రూ.55తో రూ.10 లక్షల ఆదాయం..!

-

ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరు వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది లేకుండా ఉండచ్చు. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ వివిధ రకాల పాలసీలని అందిస్తోంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు ఎల్ఐసీ ఒక పాలసీని అందిస్తోంది. దీని వలన చాలా మందికి ప్రయోజనాలు కలగనున్నాయి.

ఈ పాలసీ పేరు జీవన్ అమర్ పాలసీ. ఈ స్కీమ్‌లో ప్రతిరోజు రూ.55 చెల్లిస్తే గడువు తర్వాత మీ చేతికి రూ.10 లక్షలు వస్తాయి. మెచ్యూరిటీ బెనిఫిట్‌ కూడా ఉంటుంది. తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. డెత్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ డిడక్షన్ సదుపాయం కూడా పొందొచ్చు.

ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులన్నది చూస్తే.. ఇందులో ఇన్వెస్ట్ చెయ్యాలంటే కనీస వయసు 8 ఏళ్లు. గరిష్ఠ వయసు 60 ఏళ్లు. 10 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు గడువును ఎంచుకోవచ్చు. కనీసం రూ.2 లక్షల సమ్ అష్యూర్డ్ ఉండాలి. ఇక ఎలా దరఖాస్తు చెయ్యాలనేది చూస్తే.. దీని కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

40 ఏళ్ల వయసులో జీవన్ అమర్ పాలసీ ని తీసుకున్నట్టయితే 20 ఏళ్ల గడువుతో రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే ఏటా రూ.20 వేల ప్రీమియం చెల్లించాలి. రోజుకు రూ.55 మాత్రమే. పాలసీదారు మరణిస్తే నామినీ ఖాతాలో రూ.10 లక్షలు వస్తాయి. 20 ఏళ్ల గడువు పూర్తయ్యాక పాలసీదారుడు రూ.10 లక్షలను క్లెయిమ్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news