ఎడిట్ నోట్: కేసీఆర్ మ్యాజిక్..ఈటల లాజిక్!

-

ఎలాంటి పరిస్తితుల్లోనైనా సరే తన మాటలతో మ్యాజిక్ చేసి..వ్యతిరేకంగా ఉన్న పరిస్తితులని సైతం తనకు అనుకూలంగా మార్చుకోవడంలో తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. తనదైన శైలిలో మాట్లాడి..ప్రత్యర్ధులని సైతం ఆకట్టుకునే రాజకీయ చతురత కే‌సి‌ఆర్‌కు ఉంది. అలాగే ప్రత్యర్ధులకు తెలివిగా చెక్ పెట్టడం కూడా కే‌సి‌ఆర్‌కు వెన్నతో పెట్టిన విద్యా. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కే‌సి‌ఆర్ మరోసారి తన మాటల మ్యాజిక్ ఏంటో చూపించారు.

cm kcr etela rajender

బడ్జెట్ సమావేశాల్లో గత కొన్ని రోజులుగా..అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్..తనదైన శైలిలో తన మాజీ పార్టీ బి‌ఆర్‌ఎస్‌ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. పలు సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు. ఇక ఈటలకు మంత్రులు కే‌టి‌ఆర్, హరీష్ రావులు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. ఆఖరికి తమ మిత్రపక్షమైన ఎం‌ఐ‌ఎం తో సైతం బి‌ఆర్‌ఎస్ పార్టీ వార్ నడిచింది. అసెంబ్లీలో కే‌టి‌ఆర్ వర్సెస్ ఈటలతో పాటు కే‌టి‌ఆర్ వర్సెస్ అక్బరుద్దీన్ అన్నట్లు పోరు నడిచింది. ఇలా అసెంబ్లీలో హాట్ హాట్ ఫైట్ నడిచింది.అలా మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో కే‌సి‌ఆర్ ఎంట్రీ ఇచ్చి..బడ్జెట్‌పై మాట్లాడి..ప్రతిపక్ష సభ్యులని సైతం ఐస్ చేసేలా మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశంపై సానుకూలంగా స్పందించారు.

ముఖ్యంగా ఈటల రాజేందర్ ప్రశ్నలకు రిప్లై ఇచ్చారు..ఈటల లేవనెత్తిన సమస్యలని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తన మిత్రుడు ఈటల చెప్పిన అంశాలని పరిగణలోకి తీసుకుంటామని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు.ఇలా పదే పదే ఈటల గురించి మాట్లాడి..ఆయన మళ్ళీ బి‌ఆర్‌ఎస్ లోకి వస్తున్నారనే ప్రచారం తెరపైకి తెచ్చారు. పైగా అసెంబ్లీలో బి‌ఆర్‌ఎస్ సభ్యులు..ఘర్ వాపసీ అంటూ ఈటల పేరుని ప్రస్తావించారు. దీంతో ఈటల..కారు ఎక్కుతున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఇలా ప్రచారం వచ్చేలా చేయడానికే కే‌సి‌ఆర్..అలా తెలివిగా మాట్లాడారని, తనని డ్యామేజ్ చేయడానికే అలా చేశారని, కానీ తనని గెంటేసిన పార్టీలోకి మళ్ళీ వెళ్ళేది లేదని ఈటల తేల్చి చెప్పేశారు.

 

తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి విధేయుడుగా ఉంటానని..2004లో అలాగే తాను వైఎస్సార్‌తో కలుస్తానని ప్రచారం చేశారని, ఆనాడు పార్టీ మారలేదు అని, ఇప్పుడు కూడా మారనని..బి‌జే‌పిలోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. మొత్తానికి కే‌సి‌ఆర్ మ్యాజిక్ చేసిన ఈటల లాజిక్ తో సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news