షాకిచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఎంత పెరిగాయంటే..?

-

నిన్న త‌గ్గుద‌ల న‌మోదు చేసిన బంగారం, వెండి ధ‌ర‌.. ఆ రోజు భారీగా పైకెగ‌సి షాక్ ఇచ్చంది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం(10-04-2020) బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.43,900కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పెరుగుదలతో10 గ్రాములకు రూ.40,140కు ఎగసింది. బంగారం ధరలతో పాటూ, వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 40 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 40,990 రూపాయల వద్దకు చేరింది.

Gold Price Down 350 Rupee, Silver Price Up By 305 Rupee - अब ...

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప‌రిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయల తగ్గుదలతో 44,250 రూపాయల వద్ద నిలిచింది. అయితే, ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 110 రూపాయల పెరుగుదలతో 42,280 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.40 పెరిగింది. దీంతో ధర రూ.40,990కు చేరింది.

Gold Trims Losses After Plunging Over 2 Percent Coronavirus ...

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 100 రూపాయల పెరుగుదలతో 43,900 రూపాయలు నమోదు చేసింది. ఇక 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,140కు చేరుకుంది. అలాగే వెండి కూడా పైపైకే క‌దిలింది. దీంతో ఇక్క‌డ కేజీ వెండి ధర 40,990 రూపాయల వద్ద నిలిచింది.

 

Read more RELATED
Recommended to you

Latest news