సిబిల్ స్కోర్ ని తెలుసుకోవాలా..? సింపుల్ గా ఈ నెంబర్ తో తెలుసుకోండి..!

-

ప్రతీ ఒక్కరు కూడా ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ ని తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డు తో షాపింగ్ చేయడం సులభం అవుతోంది. అయితే ఏదైనా బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలంటే కచ్చితంగా సిబిల్ స్కోర్ చూస్తారు. క్రెడిట్ స్కోర్‌ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే ఇక మీదట ఏమి కష్టపడక్కర్లేదు. ఈజీగా తెలుసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇక వాట్సాప్ నుంచి కూడా ఉచితంగా క్రెడిట్ స్కోర్ ని తెలుసుకోండి. ఎక్స్‌పీరియన్ ఇండియా కంపెనీ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల రెగ్యూలేటరీ యాక్ట్ 2005 ప్రకారం ఇండియా లో గుర్తింపు పొందిన తొలి క్రెడిట్ బ్యూరో ఇది. పైగా ఫ్రీగా క్రెడిట్ స్కోర్ ని చూసుకోవచ్చు. ఈ అవకాశం లభించడం వల్ల మీరు ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ స్కోర్ ని చూడవచ్చు. వాట్సాప్ ద్వారా ఈజీగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. అందుకోసం 992003544 అనే నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎలా ఆ ప్రాసెస్ ఏమిటో మనం తెలుసుకుందాం.

దీని కోసం ముందు మీరు 9920035444 అనే నంబర్‌ కి హాయ్ అని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయాలి.
ఆ తరవాత మీరు వ్యూ క్రెడిట్ రిపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మిమ్మల్ని పాన్ కార్డులో ఉన్న పేరును పంపమని అడుగుతుంది. పంపాలి.
ఆ తర్వాత అఫీషియల్ మెయిల్ ఐడీ కన్ఫర్మ్ చేయాలి.
క్రెడిట్ రిపోర్టుకు కనెక్ట్ అయిన మొబైల్ నంబర్ ఇదేనా అని అడుగుతుంది. ఆ తర్వాత సెండ్ ఓటీపీ మీద నొక్కండి. ఓటీపీ వస్తుంది. తర్వాత మీ క్రెడిట్ రిపోర్ట్ వస్తుంది.
లేదు అంటే మీరు https://wa.me/message/LBKHANJQNOUKF1 లింక్ మీద క్లిక్ చేసి కూడా క్రెడిట్ స్కోర్ ని పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news