తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో రామాయణం చదవాలని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సూచించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న ‘గర్భ సంస్కార్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ వాక్యాలు చేశారు.
గర్భిణీ స్త్రీలు సుందరకాండ పఠించాలని, రామాయణం వంటి ఇతిహాసాలు చదివితే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న పిల్లలు పుడతారని అన్నారు. తమిళనాడులో ఇలాంటి నమ్మకం ఉందని చెప్పారు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ చేసిన వ్యాఖ్యలపై నాస్తికులు, కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.